రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న కటాయి రాములు (23) అనే వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఈ నిందితుడు శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు పలు చోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అతనిపై మొత్తం 14 కేసులు నమోదైనట్లు, సుమారు 6 లక్షల రూపాయల విలువైన 14 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.