శేరిలింగంపల్లిలో అనుమతి లేని కల్లు కాంపౌండ్ సీజ్

హైదరాబాద్ లో కల్లు కాంపౌండ్ లపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ 3 టీములుగా విడిపోయి ఏకకాలంలో మూడు చోట్ల తనిఖీలు నిర్వహించింది. శేరిలింగంపల్లి పరిధి సిద్ధిక్ నగర్లో కల్లు కాంపౌండ్ లపై దాడులు నిర్వహించి కల్లు శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కల్లు దుకాణాన్ని సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్