సిద్దాపూర్ గ్రామంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల తలెత్తే పర్యావరణ, ఆరోగ్య, వ్యవసాయ సమస్యలను వివరిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను కలిసి వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితిని ఉపేక్షించబోనని ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు.