హోటల్ లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి

రంగారెడ్డి జిల్లా మాదాపూర్ లోని ఒక హోటల్ గదిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఆమె ప్రియుడి ప్రమేయం ఉండవచ్చని, అతను ఘటనా స్థలం నుంచి పరారైనట్లు తెలుస్తోంది. మృతికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕