కొండాపూర్‌లోని కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్‌లో ఉడకని అన్నంతో పాటు బోనస్‌గా పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, మిడ్ డే మీల్స్ అందజేయడంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. భోజనంలో పురుగులు రావడం ఏంటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.