కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో శాఖ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జిల్లా గ్రంథాలయ సంస్థను కోరారు. ఈ మేరకు ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అలుగంటి మధుసూధన్ రెడ్డికి లేఖ రాశారు. బడంగ్పేట్ లోని గ్రంథాలయ కార్యాలయంలో గ్రేడ్ వన్ అధికారి ప్రతాప్ కి ఈ లేఖను సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ అందజేశారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు, ప్రజలకు జ్ఞాన వనరులు అందుబాటులోకి వస్తాయని, చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రంథాలయ నిర్మాణానికి అవసరమైన భూమి అందుబాటులో ఉందని కూడా తెలిపారు.