వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారిని

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు గురువారం పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, స్థానిక అధికారులతో కలిసి వరి పంటను పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పారు. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగితే, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని, నష్టపోయిన అన్ని గ్రామాల్లోని పంటలను పరిశీలించి నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించినట్లు అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్