ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌కు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరపున కృతజ్ఞతా పూర్వక సన్మానం జరిగింది. గందె సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ గందె సురేష్ నేతృత్వంలో మహాసభ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల వారు తమ కృతజ్ఞతను తెలిపారు.