బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు

షాద్‌నగర్ 11వ వార్డులోని అంగన్‌వాడి కేంద్రంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించారు. బాలికలు చదువుకోవాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, దేశానికి స్త్రీ శక్తి అవసరమని 11వ వార్డు కౌన్సిలర్ పిల్లి శారద శేఖర్ అన్నారు. బాల్య వివాహాలు చేస్తే సమాచారం ఇచ్చి వాటిని అడ్డుకోవాలని, బాధితులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్