ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఐసిడిఎస్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో కిశోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్, మున్సిపల్ కమిషనర్ సునీత, డిప్యూటీ డిఎంఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ స్రవంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లలను కిశోర బాలికలుగా పరిగణిస్తారని, ఇది బాల్యం నుండి యుక్త వయసుకు మారే దశలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు జరుగుతాయని వివరించారు.