ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పారామెడికల్, ఇంజనీరింగ్, లా కళాశాలల్లో బంద్ కు పిలుపునిచ్చింది. గురువారం షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల బంద్ ను ఎస్ఎఫ్ఐ నాయకులు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, విద్యార్థులకు సుమారు 8500 కోట్ల పెండింగ్ స్కాలర్‌షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.