మండల విద్యాశాఖ అధికారికి కౌన్సిలర్ విజ్ఞప్తి

షాద్ నగర్ మున్సపాలిటీ 16వ వార్డ్ క్రిస్టియన్ కాలనీలోని చిన్న కుంట బడిని 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు విస్తరించాలని స్థానిక కౌన్సిలర్ ఒగ్గు జయలక్ష్మి కిషోర్ మండల అధికారికి వినతి పత్రం అందజేశారు. గతంలో మాజీ వైస్ చైర్మన్ నటరాజ్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్ ప్రతిపాదన మేరకు 16 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్, స్కూల్ బెంచీలు, వాష్‌రూమ్‌ల నిర్మాణం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్