అగిర్యాలలో క్రికెట్ సునామీ: ప్రశాంత్ గౌడ్ 45 బంతుల్లో 108 పరుగులు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కొందుర్గ్ మండలం అగిర్యాలలో జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ సీజన్-3లో చిక్కోటి కింగ్స్ బ్యాటర్ ప్రశాంత్ గౌడ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేవలం 45 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 108 పరుగులు సాధించి, పరుగుల సునామీ సృష్టించాడు. గ్రామీణ స్థాయి క్రికెట్ నాణ్యతపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి టోర్నీలు దోహదపడతాయని పలువురు కొనియాడారు.

సంబంధిత పోస్ట్