డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన శిక్షణ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి యోగీశ్వర్ రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షురాలు జ్యోత్స్న చౌదరి పాల్గొన్నారు. బూత్ ఏజెంట్లు ఎన్నికల వ్యవస్థకు వెన్నెముక అని, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారి పాత్ర కీలకమని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్