ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా కొందుర్గు మండలంలోని వెంకిర్యాల, లక్ష్మీదేవుంపల్లి, అగిర్యాల, తంగళ్లపల్లి గ్రామాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగింది. కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలను సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.