రైతన్నల ఆవేదన... రోడ్డుపై బంతి పూల పరబోత

ఫరూఖ్‌నగర్ మండలం వెల్ జర్ల గ్రామంలో రైతులు పండించిన బంతి పూలకు సరైన ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో శ్రమతో సాగు చేసిన పూలను బుధవారం హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్లినా కొనుగోలుదారులు కరువయ్యారు. పండుగల సీజన్ కాకపోవడం, మార్కెట్‌లో డిమాండ్ తగ్గడంతో బంతి పూల ధరలు పూర్తిగా పడిపోయాయి. కేవలం 5 రూపాయలకు కేజీ కూడా కొనేవారు లేకపోవడంతో రైతులు తమ పంటను రోడ్డుపైనే పారబోసుకునే దుస్థితి ఏర్పడింది. పండించిన పంటకు సరైన ధర రాకపోతే రైతు కష్టం విలువ లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్