మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఎన్యూమరేషన్ ఫారం అందజేత

ప్రజాస్వామ్య వ్యవస్థను పారదర్శకంగా, పటిష్టంగా మార్చేందుకు బోగస్ ఓట్ల నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని అమలు చేస్తోందని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. అనంతరం గ్రామంలోని ఓటర్లకు కూడా ఫారాలను పంపిణీ చేసి, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్