షాద్ నగర్: క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

క్రీడల పోటీలు ప్రజల మధ్య ఐక్యతను చాటుతాయని షాద్ నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం జిల్లేడు చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. గ్రామంలో గత ఐదు యేండ్లుగా క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. క్రీడలు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతాయని, క్రీడారంగంలో రాణించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్