రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ 18వ వార్డులో బుధవారం కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో కాకతీయ స్కూల్ గ్రౌండ్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. డిప్యూటీ DMHO డాక్టర్ విజయలక్ష్మి, PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావంతి, ఏరియా మెడికల్ అధికారి డాక్టర్ సత్యనారాయణ ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ కోరారు.