శ్యామ్ రావు తండాలో ఉచిత వైద్య శిబిరం

శనివారం కేశంపేట మండల పరిధిలోని నిర్దవెల్లి గ్రామ పంచాయతీ శ్యామ్ రావు తండాలో షాద్ నగర్ విజయ కార్డియాక్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చందూలాల్ రాథోడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో తండా ప్రజలకు ఉచితంగా గుండె వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ చందూలాల్ రాథోడ్ ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఉపసర్పంచ్ సఫూరా ఆమేర్, వార్డు సభ్యులు రమేష్, నాగరాజు, చంద్రయ్య, చెన్నయ్య, వెంకటమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్