రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం తాళ్లగూడ గ్రామంలో హెచ్ఎండిఏ నిధులతో 10లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ శివ శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు జంగ నర్సింగులు పాల్గొన్నారు.