సిసి రోడ్డు పనులు ప్రారంభించిన హరినాథ్ రెడ్డి

సోమవారం కొత్తూరు మండలంలోని తీగాపూర్ లో టీజేఐఎస్ నిధులు 16 లక్షలతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొంగళ్ళ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త కాలనీ రాజు ఇంటి నుండి, చిర్ర పాపయ్య ఇంటి నుండి మైసిగళ్ల నర్సింలు ఇంటి వరకు సిసి రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్నతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్