షాద్ నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో ఓ పరిశ్రమలో పని చేసే కార్మికుడు విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళేందుకు స్టేషన్ లో శుక్రవారం రైల్వే లైను దాటుతుండగా నిలిచి ఉన్న గూడ్స్ ట్రైన్ అకస్మాత్తుగా ముందుకు కదలడంతో రైల్వే లైన్ పై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పడుకొనిపోయాడు. గూడ్స్ ట్రైన్ వ్యాగన్ల తోపాటు ఇంజన్ కూడా వెళ్లిపోగా మృత్యుంజయుడుగా ప్రాణాలతో బయట పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.