షాద్ నగర్ లో జగన్నాథ స్వామి రథయాత్ర

పూరి జగన్నాథ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆకాంక్షించారు. శనివారం షాద్ నగర్ పట్టణంలో కొనసాగిన పూరి జగన్నాథ స్వామి యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్వామివారిని పూజించిన, రథయాత్రలో పాల్గొన్న సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ సంస్కృతి మన హిందూ సంప్రదాయానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్