ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

షాద్ నగర్ నియోజకవర్గంలోని అయోధ్య పూర్ తాండ గ్రామపంచాయతీ భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, గ్రామ అధ్యక్షుడు సలావత్ నర్సింలు నాయక్ బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సలావత్ నర్సింలు నాయక్, ఇతర గిరిజన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ చేరికతో స్థానిక రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్