షాద్ నగర్ నియోజకవర్గంలో ఐదేళ్లు ఉండి, ఎన్నికలు రాగానే వనపర్తి వెళ్లి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి సేవలు చేసే రాజవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు గురించి మాట్లాడడం శోచనీయమని మాదిగ విద్యార్థి నేత జాంగారి రవి అన్నారు. మాజీ ఎమ్మెల్యేను 'పూజకు పనికిరాని పువ్వు' అంటూ రాజా వరప్రసాద్ చేసిన విమర్శలు ఆయన అహంకారానికి నిదర్శనమని, ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని రవి హెచ్చరించారు.