వినూత్న విజువల్ సృష్టులతో ప్రత్యేక గుర్తింపు పొందిన షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన ఫోటోగ్రాఫర్ బోయ మహేష్ బాబుకు “ఇండియన్ ఐకాన్ ఆఫ్ విజువల్ ఫోటోగ్రఫీ–2026” పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మక ప్రైడ్ ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. భావోద్వేగాలను చిత్రాల్లో బంధిస్తూ, క్షణాలను చిరస్మరణీయ జ్ఞాపకాలుగా మలిచే తన అసాధారణ ప్రతిభతో మహేష్ బాబు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ఆయన చూపిన సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యం, విజువల్ ప్రెజెంటేషన్‌కు ఈ అవార్డు దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు.