ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ, సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, పరిశుభ్రత, వ్యసనాలకు దూరం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర, నీరు తాగడం, సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యంగా, సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. చించోడు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.