వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే కీలక సూచనలు

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో నందిగామలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వ్యవసాయ రంగంలో ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన డీఏపీ యాప్ విధానంతో రైతులు, ఫెర్టిలైజర్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. రైతులు పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలో సరైన శాస్త్రీయ అవగాహన లేకుండా వాడుతున్నారని కూడా ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్