కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని అవాజీమియా పడకల్ గ్రామంలో రూ. 82 లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు షాద్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.