షాద్‌నగర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ సులోచన కృష్ణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్‌లో మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్, డైరెక్టర్లు కరుణాకర్, భరత్ లోహోటీ, రవి నాయక్ పాల్గొన్నారు.