దేశ స్వాతంత్ర్యం కోసం ఆస్తులు వదులుకొని, జైలు జీవితం గడిపి, దేశానికి వెలలేని ఆస్తులను సంపాదించి పెట్టిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సృష్టించిన ఆస్తులనే ప్రధాని మోదీ ఇప్పుడు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పండిత్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ జీవిస్తుందని చెప్పడానికి నెహ్రూను మించిన ఉదాహరణ లేదని ఆయన పేర్కొన్నారు.