జాగృతి అధినాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేముల నర్వ గ్రామంలో ప్రజలను మహిళలను ప్రత్యేకంగా పలకరించారు. శనివారం గ్రామానికి జాగృతి కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె నడుచుకుంటూ కార్యాలయం వైపు తరలివచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఇరువైపులా కవితను చూడడానికి నిలబడిన వారితో అమ్మ బాగున్నారా.. అక్క, తమ్ముడు అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ వచ్చారు.