హైవేపై ఇంధనం కోసం బారులు తీరిన వాహనదారులు

హైదరాబాద్-విజయవాడ హైవేపై పెట్రోల్, డీజిల్ కోసం సోమవారం వాహనదారులు బారులు తీరారు. ఇంధన కొరత ప్రచారంతో ఆందోళన చెందిన ప్రయాణికులు ఫుల్ ట్యాంక్ కోసం ఎగబడటంతో బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. కొన్నిచోట్ల స్టాక్ లేక బోర్డులు దర్శనమిస్తున్నాయి. మండుటెండల్లోనూ గంటల కొద్ది నిలబడి డీజిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో వాహనాల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఎండ వేడిమికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్