గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా పోలీసు కవాతు

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, దీనిని బాధ్యతాయుతంగా, నిర్భయంగా వినియోగించుకోవాలని షాద్‌నగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. లక్ష్మీనారాయణ ప్రజలకు సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని మొగలిగిద్ద, ఎల్లంపల్లి, చౌలపల్లి, కిషన్‌నగర్ గ్రామాలలో గురువారం పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద, ధనిక, కుల, మత భేదాలు లేకుండా అందరూ సమానంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్