తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, ఈనెల 30న అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం పిలుపునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా, సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీసులు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి పి వెంకటరామ్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఎండి ఖాజాపాషా (కేపి)లను ముందస్తు అరెస్టులు చేశారు.