రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లారీకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాద స్థలంలో రోడ్డుపై పడిన మామిడికాయలను స్థానికులు సంచుల్లో వేసుకుంటూ వెళ్లడం విశేషం.