షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని కోడిచెర్ల గ్రామంలో గ్రామపంచాయతీ నిధుల రూ. 3 లక్షలతో రెండో వార్డులో సర్పంచ్ దయ్యాల నరసమ్మ పాలకవర్గంతో కలిసి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ పనులు నేటితో పూర్తవుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటమ్మ, వార్డ్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.