సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు విజయవంతం

షాద్‌నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో మూడు రోజులుగా జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, గిరిజన సోదరులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొని సేవాలాల్ మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల ఐక్యతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమం జరగడం గర్వకారణమని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్