షాద్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ మైనార్టీ నేత సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మాయమవుతుందని, బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. శనివారం జరిగిన కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన, భారీ సంఖ్యలో నాయకులను, కార్యకర్తలను తీసుకువచ్చి కార్యక్రమానికి నిండుదనం తెచ్చారు. ఇంటింటి ప్రచారం కూడా చేశారు. కేటీఆర్ రోడ్ షోకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని, రాజధాని పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదని, జూబ్లీహిల్స్ లో మరోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు.