షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఎకో టౌన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సిద్ధాపూర్ ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు స్థానిక ప్రజల మనోభావాలకు విరుద్ధమని, గతంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయించిన భూములను అదే విధంగా కొనసాగించాలని కోరారు.