బిజెపి వైఖరి పై షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకర్ ఫైర్

షాద్‌నగర్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల సమగ్ర జాబితా అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో బీజేపీ ఓట్ల చోరీ నుంచి సీట్ల చోరీ వరకు పాల్పడుతోందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ దరఖాస్తు తిరస్కరణ దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని అశాంతి వైపు నెడుతున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహనీయులపై కాషాయ శక్తులు విషప్రచారం చేస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్