షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం

నందిగామ మండలంలోని ప్రతి ఊరు తన సొంత ఊరేనని, అభివృద్ధి తన అభిమతమని, గడచిన రెండేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేశానని, తమకు రాజకీయ కక్ష సాధింపులు లేవని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. నందిగామ మండలంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీర్లపల్లిలో జరిగిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు పీకేశారని రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఆ స్థలంలో రూ. 1 కోటి 75 లక్షలతో మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టబోతున్నామని, అందరూ అభివృద్ధినీ స్వాగతించాలని, మొక్కల పంచాయతీ రాజకీయం చేయొద్దని సూచించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్