విద్యుత్ షాక్‌తో మరణించిన కుమారుడు అజ్మత్‌కు సంబంధించి ఆరేళ్ల పోరాటం తర్వాత పాతిమా బేగం ఎక్స్‌గ్రేషియా చెక్కును షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ సమక్షంలో అందుకున్నారు. 2019లో జరిగిన ఘటనకు పరిహారం కోరుతూ చేసిన ప్రయత్నాలు గురువారం ఫలించడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.