ఆధ్యాత్మిక వేడుకలు గ్రామీణ ఐక్యతకు బలం: బీఆర్ఎస్ నేత

కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ వీరనాగమ్మ మాత కల్యాణోత్సవాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన ఆలయానికి చేరుకోగా గ్రామ పెద్దలు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రవీందర్ యాదవ్, గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను పెంపొందిస్తూ, సంప్రదాయాలను నిలబెట్టే గొప్ప వేదికలని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్