కొందుర్గు మండల కేంద్రంలో కేకే మాస్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6 నుంచి నిర్వహించనున్న మొదటి రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్ వాల్ పోస్టర్ను షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను శనివారం స్థానిక నాయకులు కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడ స్ఫూర్తిని పెంపొందించే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు శ్రీకాంత్, నాయకులు, పద్మారావు, ప్రవీణ్, రమేష్, సచిన్, కరాటే నిర్వాహకులు రమేష్ తదితరులున్నారు.