సూపర్ ఫాస్ట్ రైలుపై రాళ్ల దాడి: ముఠా ప్రయత్నం విఫలం!

మంగళవారం రాత్రి, కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్తున్న వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును తిమ్మాపూర్ స్టేషన్ వద్ద ఆపేందుకు 30-40 మంది సభ్యుల ముఠా రైలు పట్టాలపై రాళ్లు పెట్టింది. రైలు ఆగకుండా వెళ్లడంతో, ముఠా రాళ్లతో రైలుపై దాడి చేసింది. పైలట్ సమాచారం మేరకు కాచిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, ముఠా పోలీసులపై కూడా రాళ్ల దాడికి పాల్పడి పారిపోయింది. ఈ దాడిలో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్