రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొండర్గు మండల్ మహదేవ్ పూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రావడం లేదని కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. గ్రామస్తులకు నీటి సరఫరా మెరుగుపరచాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిట్టె సాయి రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే నిరసన తెలుపడం విచిత్రంగా మారిందని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు.