తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్‌నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ మండల కార్యాలయం ఎదుట ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి సన్మానించారు. తొలి దశ, మలిదశ ఉద్యమకారులు, అమరవీరుల ఆశయ సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఉద్యమాభివందనాలు తెలిపారు.