కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను కాంగ్రెస్ పార్టీతోనే సహకారం అవుతుందని అన్నారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన, మామిడి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఇళ్లను ప్రారంభించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పథకాలు వారికి స్థిర నివాసాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శాంతన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గౌస్, వార్డు సభ్యులు మంద మాధవి, కావలి రమాదేవి పాల్గొన్నారు.